“ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం..” అంటాడు కారల్ మార్క్స్. ‘‘నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణ ’’ అనేదే మార్పుకు మూల సూత్రం అంటారాయన.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కూడా కారల్ మార్క్స్ చెప్పిన పద్దతిలోనే సాగింది.
తెలంగాణ ను కోరుకున్న విప్లవకారులు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తాత్వికులు తెలంగాణ కష్టాలకు కారణాలను వివరించిన్రు..కానీ మార్చే కార్యాచరణకు పూనుకోలేక పోయిన్రు,. సరిగ్గా అక్కడే తెలంగాణను ఒక రాష్ట్రంగా మార్చడానికి కేసీఆర్ ఫ్యాక్టర్ అవసరమయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే అస్థిత్వ రాజకీయ తాత్వికత సిద్దాంతానికి భూమిక పురుడు పోసుకున్నది. రాజకీయ గతితార్కికంగా నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను చేపట్టి’’ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తద్వారా నాలుగేండ్ల తెలంగాణను స్వయం పాలనను దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టి, తిరిగి అఖండ ప్రజాదరణ తో రొండోసారి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిండ్రు. ఇందుకు మూలమైనది టిఆరెస్ పార్టీ.
కేసీఆర్ ఆలోచనా విధానం 2001లో టీఆర్ఎస్ పార్టీ రూపంలో ప్రాణం పోసుకున్నది. ఇంతింతై వటుడింతయై అన్నట్టు.. దిన దిన ప్రవర్ధమానమై ఇవాల తెలంగాణ ప్రజల రాజకీయ అస్థిత్వానికి పబ్బతిపడుతున్నది.
ఎన్నో కష్టాలను నష్టాలను ఆటుపోట్లను ఎదుర్కోని తెలంగాణ ప్రజల స్థితిని గతిని మార్చిన తెలంగాణ రాష్ట్ర సమితి…ప్రజాకాంక్షలకు అనుకూలంగా తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నది. రేపటి తరానికి చోటిస్తూ బంగారి తెలంగాణకు బాటలు వేస్తున్నది.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ నిన్నటి తరం అనుభవాల భుజాలమీంచి రేపటి ఉజ్వల భవిష్యత్తును దర్శించే భావితరానికి వారసుడుగా ప్రజలందరూ మా ‘రామన్న’ అని ప్రేమగా పిలుచుకునే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)..కు టీఆర్ఎస్ పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగిచిండు ఆ పార్టీ సుప్రీమో కేసీఆర్.తానెంతైతే బాధ్యతతోని గత 18 ఏండ్లుగా పార్టీని ప్రజలతో మమేకం చేసి ముందుకు నడిపించిండో అదే నిర్దిష్ట కార్యాచరణతో పార్టీద్వారా ప్రజలకు సేవచేసే కార్యాన్ని అప్పగించిన్రు.భగ భగ మండే కొలిమిలో కాలి సమ్మెటదెబ్బలుతిని భూమిని దున్నే ఉత్పత్తి సాధనంగా రూపాంతరం చెందిన ఉక్కుముక్క మాదిరి…రాజకీయ గురువు తండ్రి కేసీఆర్ పెట్టిన అనేక అగ్నిపరీక్షలకు తట్టుకోని నిలిచి తనను తాను తీర్చిదిద్దుకున్నడు..మన రామన్న.
తెలంగాణ రాజకీయ తాత్విక భూమికగా నిలిచిన కేసీఆర్ ఆలోచనావిధానాన్ని, కేసీయారిజం అనే స్వయం పాలనా రాజకీయ తాత్విక సిద్దాంతాన్ని, పునికి పుచ్చుకుని ., కేసీఆర్ ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులుగా కర్తవ్యభాధ్యతలను తలకెత్తుకునేందుకు ముందుకు వస్తున్న…మన రామన్నకు..మద్దతు తెలుపుదాం.
తెలంగాణను మరింత ఉన్నత దిశగా తీసుకుపోయే క్రమంలో టీఆర్ఎస్ వేదికగా తాను తలపెట్టబోయే ప్రతి కార్యాచరణకు యావత్ తెలంగాణ అండగా నిలుస్తందనే పూర్తి విశ్వాసాన్ని ప్రకటిద్దాం.. TRS నుంచి KTRS దాకా సాగుతున్న రాజకీయ అస్థిత్వ ప్రయాణానికి స్వాగతం పలుకుదాం.
ఈ చారిత్రక శుభసందర్భంలో..మన రామన్నకు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల తరుపును హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం..