పెథాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజస్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అతలాకుతలం అవుతున్న సమయంలో బాబు ఇటీవల కలిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రమాణస్వీకారానికి వెళ్లారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కల్యాణ్ సింగ్.. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్ లోని చారిత్రక భవనం అల్బర్ట్ హాల్ లో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవేగౌడ, ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.