ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి వారి పెదవులపై చిరునవ్వులను తెప్పిస్తాడు.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తన్నీరు హారీష్ రావు తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి వర్ధన్నపేట నియోజకవర్గ తాజా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తనపై ప్రజలు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత నాలుగేళ్ళుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారు..ఆసరా దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు,గురుకులాల నుండి విదేశీ విద్యకు పేదల విద్యార్థులకందించే ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ వరకు,మిషన్ కాకతీయ నుండి వరంగల్ జిల్లాకు నీళ్ళందించే కాళేశ్వరం వరకు,రైతుబంధు నుండి రైతు రుణాల మాఫీ వరకు,గ్రామాలల్లో పల్లెల్లో సీసీ రోడ్ల నుండి రహదారుల వరకు ,అమ్మఒడి నుండి సీఎంఆర్ఎఫ్ వరకు ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంలో నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను అందుకున్నారు.గతంలో ఎవరు చేయని విధంగా నియోజకవర్గాన్ని ఇటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో మొదటిస్థానంలో ఉంచారు.
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు గారి సమన్వయంతో ఇటు మిషన్ భగీరథ దగ్గర నుండి మిషన్ కాకతీయ వరకు..ఎస్సారెస్పీ దగ్గర నుండి ఎత్తిపోతల పథకాల వరకు ఇలా పలు కార్యక్రమాలను అమలు చేయడంలో తనదైన మార్కును చూపించారు అరూరి. అదే నమ్మకంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగారు అరూరి.ఈ సారి తన్నీరు హారీష్ రావు తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన రెండో ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు అరూరి. మొత్తం 99,240ఓట్ల మెజారిటీని సాధించి హారీష్ రావు తర్వాత యావత్తు ఉమ్మడి ఏపీ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ లో ఎవరు సాధించలేని రికార్డును తన సొంతం చేసుకున్నారు అరూరి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం.
సమస్య అని తన దగ్గరకు వచ్చినవారిని కాదనుకుండా దానికి వెంటనే పరిష్కారం చూపడం.. ప్రభుత్వం అమలు చేసిన ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని క్షేత్రస్థాయిలో తన పర అనే బేధం లేకుండా అర్హులకు అందేలా చేయడం.. ప్రజలకు,ప్రభుత్వానికి ,పార్టీ నేతలకు,కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తూ అందర్నీ సమన్వయం పరచడంలో విజయవంతమవ్వడం అరూరికి ఇంతటి ఘనవిజయం దక్కడానికి ప్రధాన కారణాలు అని ఇటు రాజకీయ విశ్లేషకులు,ప్రజలు చెబుతుంటారు. ఇలా 99240 ఓట్ల మెజారిటీని సాధించి ఇటు ఓరుగల్లులో రికార్డు సృష్టించడమే కాకుండా.తెలంగాణలో హారీష్ రావు తర్వాత రెండో స్థానంలో నిలవడంతో అరూరికి ప్రస్తుత ప్రభుత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పజెప్పే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వక్తలు వ్యాఖ్యానిస్తున్నారు..