Home / Government / 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలని చెప్పారు.ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు.

కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం
———————————————————
రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని, వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు
———————————————–
కొత్తగ నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీకార్యదర్శులతో కలిసి మొత్తం 12,751 వేల మంది గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలు, ఇవోపిఆర్డిలు, డిపిఓలు, డిఎల్పీఓలతో కలిపి ఈ నెల 27న ఎల్.బి. స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మద్యాహ్నం 12 గంటల వరకు ఎల్.బి. స్టేడియం చేరుకుంటారు. మద్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు.

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు
—————————————
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్ ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019-20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పెన్షన్లు అందివ్వాలని చెప్పారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం
——————————————
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat