బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.లీగ్ మ్యాచ్ లో వరుస విజయాలు సాధించి,నిన్న జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్(అమెరికా)పై సింధు విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.
