పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ ఓడిపోయాడు. దీని ద్వారా అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. ఈ విషయంలో గంగూలీ,క్లైన్ లాయిడ్‌ల రికార్డును కోహ్లి సమం చేశాడు. శుక్రవారం మొదలైన రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.ఇక స్కోర్ వివరాలకు వస్తే ఆస్ట్రేలియా 92/0,మార్కస్ హర్రిస్ 52,ఆరోన్ ఫించ్ 38 నిలకడగా అడుతున్నారు.
