ఏపీలో కొందరు ఇంటిటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు.. ఇంతకీ ఎవరంటారా.. వాళ్లే అగ్రిగోల్డ్ బాధితులు.. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతీఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకూ వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్ బాధితులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు, మూడు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు తెలిపారు. లేకపోతే సహించబోమని హెచ్చరించారు
