సూర్యాపేట శాసనసభ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పై అపార నమ్మకం ఉంచారు. ఓటింగ్ జరిగన తరువాత ఎవరికి వారు నాకు మెజార్టీ వస్తుంది, నాకు మెజార్టీ వస్తుంది అంటు ఎవరికి వారు లెక్కలు వేసిన ఓటరు మాత్రం జగదీష్‌రెడ్డికే ఓటు వేసి అండగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలో 52,418 ఓటు వేయగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి 20,152 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి 15,399 మంది ఓట్లు వేయగా బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్లుకు 14,183 మంది ఓట్లు లభించాయి. అత్యధికంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి 4,753 ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డికి వచ్చింది.
ఆత్మకూర్(ఎస్) మండలంలో 34,583 ఓటింగ్ కాగా 12,202 మంది టీఆర్‌ఎస్‌కు,11,440 మంది ఓటర్లు కాంగ్రెస్‌కు 7,725 మంది బీజేపీకీ ఓటు వేశారు. టీఆర్‌ఎస్‌కు 762 ఓట్ల మెజార్టీ వచ్చింది. పెన్‌పహాడ్ మండలంలో 27, 863 మంది ఓటర్లు ఓటు హ క్కు ను వినియోగించుకు న్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థికి 10,814 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 9624, బీజేపీకి5 248 ఓట్లు వచ్చాయి. ఇలా ప్రతీ రౌండ్ లోను తన అధిపత్యాని ప్రదర్శించి విజయం సొంతం చేసుకున్నారు.దీంతో సూర్యాపేట శాసనసభ్యుడిగా గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 5,957 ఓట్ల మెజార్టీతో రెండోసారి విజయకేతం ఎగురవేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి 37.34 శాతం , కాంగ్రెస్ కు 34.10 శాతం, బీజేపీకి 21.35 శాతం ఓట్లు వచ్చాయి.