తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబసభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మరోవైపు ఈనెల 18న కొత్త అసెంబ్లీ కొలువుదీరుతుందని భావిస్తున్నారు. ఆ రోజు కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారని, మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని సమాచారం. దీనిపై శుక్రవారం జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.