ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో గాలులు గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడనుండడంతో తీర ప్రాంత ప్రజలు సముద్రం వద్దకు వెళ్ళకూడదని ఆదేశిస్తున్నారు. వాయుగుండం తుఫానుగా మారితే నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
