తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు అందు బాటులో ఉండి సేవలందించిన దానికి కృతజ్ఞతగా మంగళవారం వెలువడిన ఎన్నికల పలితాలలో అరూరి కి గతంలో కంటే అధికంగా 99 వేల పైచిలుకు ఓట్లు మెజారిటీ వచ్చాయని పలువురు పేర్కొంటున్నారు.
మాయాకూటమి గా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీలను చిత్తుచేసేలా వర్ధన్నపేటలో అఖండ మెజారిటీని అందించి వాటికి తగిన గుణపాఠం చెప్పాయని ఓటర్లు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.ఆయనను ధీటుగా ఎదుర్కోవడానికి కూటమి నుండి టీజేఎస్ అభ్యర్థి దేవయ్య పగడిపాటి కి 32012 ఓట్లు వచ్చాయి.ఏ విధంగాను అరురికి ఎదురు నిల్వలేకపోయాడు.అయితే ప్రభుత్వ పథకాల లబ్ధ్దిదారుల మద్దతుతో పాటు నియోజకవర్గంలోని ఓటరు నాడిని పట్టి ఘన విజయం సాదించిన ప్రజానేత అరూరి రమేశ్ గొప్ప వ్యక్తి అని పలువురు పేర్కొంటున్నారు.