తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలివ్వగా కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు ఇద్దరికీ అవకాశాలు అనే విధంగా ఫలితాలిచ్చాయి. అయితే కొందరు చేసిన సర్వేల్లో మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది దరువు.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం దృష్టితోనే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేసినపుడు అభినందించడంతోపాటు ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేసినపుడు నిలదీసేందుకు వెనుకాడలేదు. అలాగే ప్రతిపక్షా బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేసింది. గతంలో దరువు చెప్పిన సమాచారం మొత్తం అక్షరసత్యాలయ్యాయి. పార్టీల్లో చేరికలు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపోటములను ముందుగానే వెల్లడించింది దరువు.
ఈ నేపధ్యంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టింది దరువు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యుత్తమ నైపుణ్యం, అనుభవం కలిగిన యువతతో సర్వే ప్రక్రియ ప్రారంభించిన దరువు టీం రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించింది. ప్రతీ మండల కేంద్రంలోనూ ఓటర్ల నాడి తెలుసుకుంది.ఈ క్రమంలో ఎన్నికలకు ముందే దరువు వీడియో సర్వే చేసి టీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధిస్తుందని తేల్చిచెప్పింది. మహాకూటమికి దాదాపుగా 80వేలమంది బైట్స్ ని వీడియో రూపంలో సేకరించింది దరువు.. 75శాతంమంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకున్నట్టు తేలింది. అక్కడక్కడా పార్టీ అభ్యర్ధులపై కాస్త అసంతృప్తి ఉన్నా.. కేసీఆర్ మానియా ముందు అవేమీ పనిచేయవని, అలాగే ప్రతిపక్ష కూటమి ప్రభావం చూపదని తేలింది.
ఈ సర్వేలో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరంకాగా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 78 నుంచి 85 సీట్లు దక్కుతాయని చెప్పింది దరువు.. ప్రస్తుత ఫలితాలు కాస్త అటుఇటుగానే వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 16 నుంచి 22 (కాంగ్రెస్+టీడీపీలకు మాత్రమే) సీట్లు, ఎంఐఎం పార్టీకి 7సీట్లు, బీజేపీకి 3 స్థానాలు వస్తాయని చెప్పగా ప్రజాకూటమిలో భాగమైన టీజేఎస్, సీపీఐలకు ఒక్కస్థానం కూడా దక్కే అవకాశం లేదని చెప్పింది. ఇప్పుడదే నిజమైంది. రాష్ట్రవ్యాప్తంగా దరువు నిర్వహించిన సర్వేలో అతికొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే టీఆర్ఎస్, కూటమి అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇలా దరువు వెల్లడించిన సర్వే ఫలితాలు నూటికి 95శాతం అక్షరసత్యాలవడం సంతోషకరం.. దరువును నమ్మిన పాఠకులు ఎప్పటికీ మాపై ఇదే నమ్మకాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ దరువు యాజమాన్యం.