తెలంగాణలో టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటింది. గజ్వేల్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా 51,515 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 19,391 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో ఈసారి మెజార్టీ తగ్గుతుందా.. అంతకంటే పెరుగుతుందా అన్న అంశంపై ప్రజలు ఆసక్తి కనబర్చారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే 32,124ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ ఘన విజయం సాధించారు. దీంతో గజ్వేల్‌పై లగడపాటి వేసిన అంచనా పూర్తిగా తప్పయినట్లయింది. గజ్వేల్‌లో కొందరు కానిస్టేబుళ్లతో మాట్లాడానని.. ఆయన ఓడిపోతారని చెప్పారని కేసీఆర్‌పై లగడపాటి పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
