తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్.. అంతకుముందు విజయం మాదే అని పేర్కొంటూ.. ఫలితం మాకనువుగా రాకుంటే గొంతు కోసుకుంటా అని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఫలితం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ దే గెలుపు అని ఫిక్సయ్యారంతా! దీంతో అందరి చూపు బండ్ల గణేష్ పై పడింది. కాలర్ ఎగరేస్తూ గొంతు కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎక్కడ? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
‘‘బండ్ల గణేష్ కనిపించటంలేదు! బండ్ల గణేష్ దుకాణం సర్దేశాడు! గణేష్.. దమ్ముంటే నువ్వు అంతకుముందు మాట్లాడిన మాటమీద ఉండగలవా?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు బండ్ల గణేష్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు.మరి బండ్ల గణేష్ చెప్పినట్టే చేస్తాడ లేదా పారిపోయి ఎక్కడైనా తలదాచుకుంటాడా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి