టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్ కుమార్, సాయన్న, ఆరూరి రమేష్) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు.
టీఆర్‌ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని ఉద్దండులు సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు.కూటమిలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఒక్క పార్టీ కూడా ఖాతా తెరవలేదు. సమాచారం ప్రకారం 89 స్థానాల్లో టీఆర్‌ఎస్ లీడింగ్‌లో ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విజయం సాధించింది.
మొత్తం 90 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ఉద్దండుల విషయానికొస్తే.. నేను సీఎం అంటే నేను సీఎం అన్న వాళ్లంతా ఉసూరమంటున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మొదలుకుని మాజీ మంత్రులు డీకే అరుణ, కోమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ, సునీతా లక్ష్మరెడ్డిలు ఓటమి దిశగా పయనిస్తున్నారు.
ఇక కొడంగల్ వరకు చూసుకుంటే నా అంతటి మొగోడే లేడు అన్న రేవంత్ రెడ్డి సైతం ఓడిపోతున్నాడు. పాలమూరు జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో టీఆర్‌ఎస్ ముందంజలో దూసుకు పోతున్నది.ప్రజాతీర్పును అంగీకరిస్తన్నామని చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగానే తన గెడ్డం తీపిస్తారా అనేది తెలియాలి.లేకుంటే అప్పుడుమాటలు చెప్పి ఇప్పుడు తప్పించుకుంతారా??