కారు జోరుకు కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది.కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్ హేమాహేమీలు రేవంత్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.ఊరురా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది. ఇప్పటికి టీఆర్‌ఎస్ ఉన్నారు. మొదటి రన్ ఎమ్‌ఐఎమ్ కొట్టేసింది.
కాంగ్రెస్‌కు అన్నిచోట్లా ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెనుకబడ్డారు. ఇప్పటికి . మరోవైపు కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతలు వెనుకబడ్డారు. టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కూకట్‌పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, వైరా, శేరిలింగంపల్లి, నకిరేకల్, వనపర్తిలో టీఆర్‌ఎస్.. పరిగి, సూర్యాపేట్, తుంగతుర్తి, హుజుర్‌నగర్, భూపాలపల్లిలో కాంగ్రెస్ దూసుకుపోతోంది.ఇక మహాకుటమి పరిస్థితి ఏమిటో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి.కొందరు నాయకులు రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం అని చెప్పారు.మరి వాళ్ళు సన్యాసానికి సిద్ధంగా ఉండక తప్పదు.