ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ 318వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం రాగోలు నుంచి ప్రారంభించారు. అయితే పాదయాత్ర మెదలు నుండి ఇప్పటి వరుకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు జరిగినాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, టీడీపీ నేత కటారు సుబ్బిరామిరెడ్డి వైసీపీలో చేరారు. మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనతో పాటు మరో 30 మంది టీడీపీ నేతలు పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి వెళ్లి జగన్ సమక్షంలోచేరారు. వారందరికీ కండువా వేసి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కుండ్ల రమణారెడ్డి, మాతా రమణ, రాము యాదవ్, కటారు చంద్రశేఖర్‌రెడ్డి, చప్పిడి శంకర్‌రెడ్డి, బి.నరేష్, కటారు అమరనాథ్‌రెడ్డి, జి.సురేష్, కటారు సుబ్బ నరసారెడ్డి, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
