కూటమి నాయకులు, బెట్టింగ్ మాఫియాల సమిష్టి సమర్పణలో విడుదలైన సినిమా ‘లగడపాటి_సర్వే’
ఇదో ఆపరేషన్ గరుడను మించిన ఆపరేషన్ లగడ. ప్రతి సారి ఒక కొత్త మనిషిని ముందు పెట్టడం.. ఒక కొత్త ప్రచారం ప్రజల్లోకి వదలడం.. తమ మీడియాలో దాన్ని తిప్పితిప్పి వేయడం.. అది అబద్దమని తెలిసేలోపు సాధ్యమైనంత ఎక్కువ లబ్ది పొందడం.. ఇదీ ‘వారికి’ వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే ఇప్పటికే కూటమి నాయకులు బెట్టింగ్ బంగార్రాజులు కలిసి లగడపాటి తో సర్వే అని ప్రెస్ మీట్ పెట్టి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నరు. అది చెప్పేటప్పుడు ఎందుకైనా మంచిదని డబ్బు ప్రవాహం చాలా ఉందని ఆయనతో ఒక మాట చెప్పించారు.
రేపు పొద్దున వాడు చెప్పేది తప్పని తెలిసి అందరూ మొహాన ఛీ కొడితే టీఆర్ఎస్ చాలా డబ్బు పంచిందని అందుకని సరిగ్గా అంచనా వేయలేకపోయాం అంటాడు. డబ్బు ప్రభావం ఉంటుందని ముందే చెప్పాను అంటడు. మరోవైపు ఈవీయెంల ట్యాంపరింగ్ పై అనుమానాలున్నాయని, స్ట్రాంగ్ రూంలకు భద్రత లేదని ఇపుడు కొన్ని ఆరోపణలు చేసి పెట్టుకుంటున్నారు కూటమి నాయకులు. రేపు ఓడినపుడు మేం ముందే చెప్పలేదా టీఆర్ఎస్ అక్రమాలు చేసింది కాబట్టే ఓడాం అంటారు.
ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత స్థానిక, జాతీయ మీడియా సంస్థలు టీఆర్ఎస్ విజయమని కోడై కూస్తుంటే పరువు పోతుందని భావించి ఒక క్యారెక్టర్ ని దింపి, సర్వే అని పెట్టించి దాన్ని టీవీల ముందు చెప్పించారు ఈ నాయకులు.
జాతీయ మీడియా స్థానిక మీడియా చెప్పినవి పక్కన పెట్టి ఆ పంచాంగం పై ‘తమ’ చానెళ్లలో చర్చలు పెట్టి మూడు రోజులు నడిపిస్తరు. ఇది నడుస్తుండగానే కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాదే విజయం అంటారు. రేపు ఓడి పోగానే అరరే ఇలా అయిందేమిటి. మేమే గెలవాల్సింది కేసీఆర్ ది తొండాట అంటారు. సర్వేలన్నీ అబద్దం అంటున్న కూటమి నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో కాంగ్రేస్ గెలవొచ్చు అన్న జాతీయ మీడియా రిపోర్టులను ఎందుకు ఫేక్ అనట్లేదు. దాన్ని ఇక్కడ తోసిపుచ్చలేక లగడపాటి అనే మరిచిపోయిన కామెడీ క్యారెక్టర్ ని తెరమీదికి తెచ్చారన్న వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు.