తెలంగాణలో పోలింగ్ పూర్తయిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే…అయితే ఇందులో కూటమి గెలుస్తుంది,టీఆర్ఎస్ కు ఎక్కువ సీట్స్ లు రావని ఆయన చెప్పడం జరిగింది.అయితే దీనికి ధీటుగా సమాధానం ఇచ్చారుతెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జీ.వివేక్.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ కోసమే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలను ఇచ్చారని ఆయన ఆరోపించారు. సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఆయనప్రయత్నించారని, ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజానికం మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసమే కూటమికి అనుకూలంగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. కాగా మహాకూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఇదివరకే ఆయన సర్వే ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.