ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు. బీసీలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి అన్నారు. అంతేకాదు బీసీ సంక్షేమంపై వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీసీలు ఎప్పటికీ టీడీపీ వెంటే ఉంటారని, వైఎస్ కుటుంబం బీసీలను అణగదొక్కిందని మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నా బీసీ సబ్ ప్లాన్ కు నిధులిచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.
