వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం వైసీపీ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో అబ్దుల్ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్ గని పేర్కొన్నారు. టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం హిందుపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత వైసీపీలో చేరడం.. ఆ పార్టీ శ్రేణులకు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ సీనియర్ నేత అయిన అబ్దుల్ గని 2009 నుంచి 2014 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ కోసం ఆయన హిందూపురం సీటును వదులుకున్నారు. అబ్దుల్ గని చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనను పట్టించుకోకుండా అవమానాలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ప్రజాభిమానానికి తాను సైతం మద్దతు పలుకుతూ.. అబ్దుల్ గని తాజాగా వైసీపీలో చేరారు.
హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే