తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభంజ నం కొనసాగుతుందని మంత్రి జోగు రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. అంతేగాక పార్టీ కోసం పని చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు
