పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, చల్లాధర్మారెడ్డి పై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను మళ్ళి బరిలో దింపారని తెలుస్తుంది.ఈ నియోజకవర్గంలో ధర్మారెడ్డి గారు ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.దేశంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు దీవిస్తున్నారు.
చల్లా ధర్మారెడ్డి గారు తన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. గత పాలకులు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. గూండా రాజకీయాలను ప్రజలు తరిమికొట్టే రోజులు వచ్చాయని అన్నారు. రాజకీయాల్లో గూండాయిజాన్ని సహించేది లేదని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో అడిగినదానికన్నా ఎక్కువనే ఇచ్చారన్నారు. ప్రజలు తనకు మరోసారి అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపిస్తే కేసీఆర్ చొరవతో మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తుంటే వాళ్ళని రాకుండా ప్రజలు అడ్డుకొని…మా ఓటు టీఆర్ఎస్ కే వేస్తామని చెబుతున్నారు.జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ జై కొడుతున్నారు…ఇక్కడ ప్రజలు భారీ మెజారిటీతో తమ నాయకుడైన చల్లా ధర్మ రెడ్డి గారిని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు.