తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరుగుతూ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ అబివృధ్ధి చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణలో వచ్చాయి. అంతేకాదు అంతర్జాతీయ గుర్తింపు కూడ వచ్చింది. 60 ఏండ్లలో గత పాలకులు చెయ్యాని పనులు కేసీఆర్ కేవలం 4 ఏండ్లలో ఏంతో చేశాడో అని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంకొక కేసీఆర్ కు అవకాశం ఇస్తే మరింత సంక్షేమ పథకాలను అబివృధ్ధి జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజాసంక్షేమ పాలన కావాలంటే.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇకపోతే వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేండ్లలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసే చాలా మంది ఆకర్షితులై గులాబీ పార్టీకి జై కొడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. మెజారిటీ కోసమే ప్రచారమని ఆరూరి రమేష్ తెలిపారు. అంతేకాదు ఖచ్చితంగా లక్ష మెజారీటి ఖాయం అంటున్నారు వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజలు.
Tags aroori ramesh kcr telangana trs vardhannapeta