గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో పూర్తి చేసి 60,౦౦౦ ఎకరాలకు నీళ్లు అందిచటం హర్షణీయం. మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి నీళ్లు అందటంతో నియోజకవర్గంలో ప్రజలకు తుమ్మల నాగేశ్వర్ రావు గారి పట్ల అభిమానం పెరిగిందని సమాచారం.
గత కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి గడిచిన రెండు సంవత్సరాలుగా పరుగులు పెడుతుందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడ్డారు. తుమ్మల తమ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించటం తమ అదృష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మహాకూటమి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమిలేదని, గుత్తేదారుడుగా కోట్లకి పడగలెత్తిన కందాల ఇప్పటివరకు ప్రజలకి చేసిందేమీలేదని, కాంగ్రెస్ టీడీపీల కలయికని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు.తుమ్మల వచ్చిన దగ్గర నుండి అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నామని చెప్పారు.ఇలాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గాన్ని ఒకరు ఉండాలని అభిప్రాయపడ్డారు. తుమ్మల అసలు ఓట్లు అడగాల్సిన అవసరంలేదని, అయన చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని చెప్పారు. ప్రతి రైతు గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, అన్ని వర్గాల ప్రజలు తుమ్మల గెలుపుని కోరుకుంటున్నారని, పాలేరులో తుమ్మల పాగా వేయటం ఖాయమని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.