* 158 ఎకరాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!!
* టీడీపి వర్గాల అక్రమణలో ఇనామ్ భూములు..శిథిలావస్తలో దేవాలయాలు..
* ప్రజల చందాలు మాయం…ఆలయాల నిర్మాణం శూన్యం…
* వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవడు అడిగేది…!!
* ఏదేచ్చగా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు…
* మీ భూమిలో ఫిర్యాదుచేసినా పట్టించుకోని దేవాదాయశాఖ..!!
ఆ గ్రామానికి నూట యాభై ఎకరాలకు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు నోచుకోలేక శిథిలావస్తకు చేరుకున్నాయి. ఏళ్లు గడుస్తున్న ఆవూరి ఆలయాల పరిస్థితి ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. దాదాపు మండలంలోనే ఏగ్రామానికి లేని ఇనాం భూములు ఉన్నా ఇనాందారులు శిస్థులు చెల్లించక పోవటంతో ఆలయాల పునర్‌నిర్మాణానికి గ్రామ ప్రజల చందాలే శరణ్యం అవుతున్నాయి. ఇచ్చిన చందాలు ఏకోశాన సరిపోక ఇటు నిధులు లేక అద్వానంగా తయారయ్యాయి.
కర్నూల్ జిల్లాలోనే అత్యధిక దేవాదాయ భూములు ఉన్న గ్రామం తుగ్గలి మండలంలోని మారెళ్ల గ్రామం దాదాపు 158 ఎకరాల భూమి ఉంది. జిల్లాలోనే అత్యధిక దేవాదాయ భూములు ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే అది మారెళ్ల గ్రామం మాత్రమే. ఇంత భూమి ఉన్నప్పటికి ఆ ఊరిలోని దేవాలయాలు ఎలాంటి అభివృద్దికి నోచుకోవటం లేదు.
ముఖ్యంగా ఆంజనేయ స్వామి (24 ఎకరాలు), ఈశ్వరుడు, సుంకులమ్మ(27 ఎకరాలు), ఇతర ఇనామ్ భూములు (101 ఎకరాలు) ఉన్నాయి. ఈ భూములు కేవలం ఒకే సామాజిక వర్గం (టీడీపి నాయకులు) ఆక్రమణలో ఉండి ఎదేచ్చగా ఎలాంటి శిస్తులు చెల్లించకుండా కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. దీంతో గ్రామంలోని ఆలయాల అభివృద్ది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని దేవాలయాల, గ్రామ అభివృద్దికి వాడుకోవాల్సింది పోయి ఆభూముల నుంచే వచ్చే ఆదాయాన్ని కేవలం కొన్ని కుటుంబాల చేతులలో ఉండి దర్జాగా అనుభవిస్తున్నారు. ఒకే కుటుంబం చేతులలో అత్యధికంగా 40 ఎకరాలు సాగు చేసుకుంటూ ప్రభుత్వానికిగాని, దేవాదాయ శాఖకు గాని ఎలాంటి శిస్తు చెల్లింటం లేదు. వేలం వేసి దేవాలయాలను మరమ్మత్తులు చేయించాలని గ్రామ ప్రజల కోరుతున్నా ఇటు ప్రభుత్వం గాని, దేవాదాయ శాఖగాని, రెవెన్యూ యంత్రాంగం కాని ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాలీగా ఉన్నా అక్రమించుకోని దర్జాగా అనుభవిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగటం సాగు చేసుకుంటామ్ ఎవరు అడిగేది అని దర్బాశలకు దిగుతున్నారు. దీంతో దేవాలయాలు నిర్లక్షానికి గురవుతున్నాయి. కొన్ని దేవాలయాలు పాడుబడి పోయి శిథిలావస్తకు చేరాయి.
ప్రధానంగా సుంకులమ్మ, కాలమ్మ దేవాలయాలకు 28 ఎకరాలు ఉన్నప్పటికి దేవాలయం పూర్తిగా గోడలు కూలిపోయి శిథిలావస్తకు చేరుకుంది. గత రెండు సంవత్సరాల క్రితం సుంకులమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రామ ప్రజల నుంచి చందాలు వసూలు చేశారు. ఇచ్చిన చందాలతో ఆలయ నిర్మాణం చేపట్టక పోగా నిధులను స్వాహచేయటమే కాక దాతలు ఆలయ నర్మాణానికి ఇచ్చిన ఇటుకలను, రాళ్లను తమ సొంత పనులకు వాడుకుని విగ్రహాలపై కవర్‌తో కప్పి వదిలేశారు.
ఇనాం భూములకు దేవాదాయశాఖ ఆద్వర్యంలో కమిటీలు లేక శిస్థులు వసూలు చేయటంలేదు. భూములను సాగుచేసుకుని అనుభవిస్తున్నారే తప్ప భూములకు ఎలాంటి శిస్థులు చెల్లించడం లేదు. ఇప్పటికైనా దేవాదాయశాఖగాని, ఇటు రెవెన్యూ యంత్రాంగం గాని చర్యలు తీసుకుని ఆక్రమణలో ఉన్న ఇనాం భూములను పరిరక్షించి వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని దేవాలయాల పునర్‌నిర్మాణానికి, గ్రామ అభివృద్దికి వినియోగించాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.
ఇనాం భూముల సర్వే నెంబర్లు….174, 235, 310, 405, 422, 493, 500, 541………101.97 ఎకరాలు.
సుంకులమ్మ, ఎల్లమ్మ దేవాలయ భూముల సర్వే నెంబర్లు 299, 584-1…………………………………26.41 ఎకరాలు.
ఆంజనేయ స్వామి ఇనాం భూముల సర్వే నెంబర్లు…99, 112, 267……………………….24.41 ఎకరాలు.
ఈశ్వరుని, మస్తానయ్య స్వాముల ఇనాం భూముల సర్వే నెంబర్లు…102, 248……………..4.96 ఎకరాలు.