Home / NATIONAL / ఖ‌మ్మం వేదిక‌గా జాతీయ రాజ‌కీయాలపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఖ‌మ్మం వేదిక‌గా జాతీయ రాజ‌కీయాలపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు.

ఈ క్ర‌మంలో  జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ అవసరం ఉంది అని ఆయ‌న తేల్చిచెప్పారు.బ‌డాయి మాట‌ల చంద్ర‌బాబుకు త‌న‌కు ఎలాంటి తేడా ఉంటుందో ఈ సంద‌ర్భంగా కేసీఆర్ వివ‌రించారు. “ఢిల్లీలో చక్రం తిప్పుతా.. తోక తిప్పుతా అని చెప్పడం రాదు. ఢిల్లీని అదుపు చేసేటటువంటి రాజకీయం మాత్రం ఈ ఎన్నికల తర్వాత గ్యారెంటీగా ఉంటది. భారతదేశం కూడా ఇవాళ దిక్కు, దిక్సూచి లేకుండా ఉంది.

కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమైనాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని నరేంద్రమోదీకి అధికారమిస్తే.. ఆయన కూడా చతికిలబడి పోయిండు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ఈ రెండు పార్టీలు దేశానికి పనికిరావు. అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారు. ఈ దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది. దీని కోసం తాను కొంత ప్రయత్నం చేశాను.  మ‌రింత ప్ర‌య‌త్నం కొన‌సాగుతుంది“ అని సీఎం కేసీఆర్ స్ప‌స్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat