మర్రి శశిధర్ రెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం తెరమీదకు వచ్చిన నాటి నుంచి మీడియాలో తెగ హడావుడి చేసేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ఇష్టానుసారంగా జరుగుతోందని ఆరోపించడేమ కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలాగా ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓట్లు ఉంచి ఇతరులు ఓట్లు తొలగిస్తున్నరని విమర్శించారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు చేయాలి కానీ అలా జరగడం లేదన్నారు. ఫైనల్ ఓటరు లిస్ట్ అర్ధరాత్రి ఎప్పుడో విడుదల చేశారని విమర్శించారు. దేశ సమగ్రత కోసం యువత జాగృతం కావాలని మర్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. ఓటరు నమోదు అవకతవకలపై వేసిన కేసు ఇంకా కోర్టులో ఉందని మర్రి శశిధర్ రెడ్డి గుర్తుచేశారు.
ఇలా పోరాటం చేస్తానని ప్రకటించిన మర్రి శశిధర్ రెడ్డి ఇప్పుడు తన పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తోంది. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ కట్టిన పొత్తుల్లో భాగంగా మర్రికి షాక్ తగిలింది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన సనత్‌నగర్ సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మర్రిశశిధర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సీటు టీడీపీకి కేటాయించడం బాధాకరమని అన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్న మర్రి.. నియోజకవర్గంలో తన కమిట్‌మెంట్స్ తనకున్నాయని చెప్పారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.
Tags congress delhi leaders marri sashidhar reddy pinished trs