Home / 18+ / ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేత‌ల‌కు, ప్రజలకు నచ్చనిది?

ఇందుకే కాంగ్రెస్ అంటేనే నేత‌ల‌కు, ప్రజలకు నచ్చనిది?

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు సీనియ‌ర్ నేత‌లంటే లెక్కేలేదా? మంత్రులు అయినా..పీసీసీ అధ్యక్షులు అయినా…జాతీయ స్థాయిలో ప‌ద‌వులు అలంక‌రించిన నాయ‌కులైనా…ఆ పార్టీకి పూచిక‌పుల్ల‌తో స‌మానమా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ప్రస్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ అయిన మర్రి శశిధర్ రెడ్డికి టికెట్లు ద‌క్క‌ని తీరుతో ప‌లువురు ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో తెలంగాణవ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌కు ఆయ‌న చేతుల మీదుగా బీఫాంలు అందించిన పొన్నాల లక్ష్మయ్యకు ఈ ఎన్నిక‌ల్లో షాక్ త‌గిలింది. టీజేఎస్ నేత కోదండ‌రాం జ‌న‌గామ నుంచి బ‌రిలో దిగుతార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పొన్నాల‌కు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఢిల్లీ స్థాయిలో భారీ ఎత్తున లాబీయింగ్ చేసినా మూడో లిస్టులో హైకమాండ్ జనగామ సీటును పొన్నాలకు దక్కింది. ఢిల్లీలో ఆందోళ‌న‌గా స‌మ‌యం గ‌డుపుతూ…మొద‌టి జాబితా,రెండో జాబితాలో వ‌స్తుందా…ఆఖ‌రికి మూడో జాబితాలో అయినా మోక్షం దొర‌కకపోతుందా అంటూ ఉత్కంఠ‌తో గ‌డిపి త‌న శ‌క్తియుక్తుల‌న్నీ రంగ‌రించి…మూడో జాబితాలో చోటు సంపాదించుకొని..హ‌మ్మ‌య్య అంటూ ఢిల్లీ నుంచి రాష్ర్టానికి విచ్చేసి నామినేష‌న్ల గ‌డువుకు రెండ్రోజుల ముందు ఆయ‌న నామినేష‌న్ వేస్తున్నారు.

పార్టీ అగ్రనేతల్లో ఒక‌రైన మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి సీటు వ్యహహారంలో ఢిల్లీ పెద్దలు వ్యహ‌రించిన తీరు అవ‌మాన‌క‌రంగా ఉంద‌నేది అనేక‌మంది మాట‌. పొత్తుల్లో భాగంగా సనత్ నగర్ సీటును కూటమిలోని టీడీపీ అభ్యర్ధి కూన వెంకటేష్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీటు కేటాయించింది. కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన శశిధర్ రెడ్డి సీటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే సనత్ నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టిన మర్రి శశిధర్ రెడ్డి అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సుప్ర‌సిద్ధ కాంగ్రెస్ నేత అయిన చెన్నారెడ్డి వారసుడికి మొండి చేయి చూపినట్లైంది.

కాంగ్రెస్ ముఖ్యనేత‌లు అయిన ఈ ఇద్దరు నాయ‌కుల విష‌యంలో కాంగ్రెస్ వ్యవ‌హ‌రించిన తీరు సంచ‌ల‌నంగా మారింది. పొత్తుతో పార్టీకి మేలు చేయాల్సింది పోయి…కాంగ్రెస్ సీనియర్ల సీటుకు ఎసరుపెట్టిందని ప‌లువురు వాపోతున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికి కాంగ్రెస్ ఇచ్చే గౌర‌వం ఇదేనా అనేది అనేక మంది ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో భారీ ఎత్తున లాబీయింగ్ చేసుకున్న నిన్న మొన్న చేరిన నేత‌ల‌కు వ‌చ్చిన టికెట్లు…మూడో లిస్టులో కూడా ముఖ్య నేత‌ల‌కు ద‌క్క‌క‌పోవ‌డ‌మే కాంగ్రెస్ మార్క్ రాజకీయ‌మ‌ని పలువురు మండిప‌డుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat