Home / 18+ / కోదండరాంను మేం గౌర‌విస్తే..కాంగ్రెస్ దగ్గర అవ‌మాన‌పాల‌వుతున్నారు

కోదండరాంను మేం గౌర‌విస్తే..కాంగ్రెస్ దగ్గర అవ‌మాన‌పాల‌వుతున్నారు

తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ పంచ‌న చేరి అవ‌మానాల పాల‌వుతున్నార‌ని మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, చంద్రబాబు ఎంత అవమానపరిచాడో ఆయన మరిచిపోయిన ప్రజలు మరిచిపోరు. ఆనాడు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు చేసింది. కాంగ్రెస్ నాయకులు నాడు చెరుకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లను టీజేఎస్‌కు అంటకడుతోందన్నారు. కోదండరాం నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించుకుంటాం` అని హరీష్‌రావు తెలిపారు.

తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్ అంటూ ముందుకు తెచ్చారని మంత్రి హ‌రీష్‌ రావు వివ‌రించారు. కూటమి ఏ ఉద్దేశంతో ఏర్పాటైందో స్పష్టత ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు టీఆర్‌ఎస్ అండగా నిలిచింది. ఆనాడు ఉస్మానియా విద్యార్థులపై కేసులు పెట్టింది కాంగ్రెస్ అయితే.. బెయిల్ ఇప్పించింది టీఆర్‌ఎస్ అని గుర్తు చేశారు. విద్యార్థి నేతలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. ప్రొఫెసర్ సీతారాం నాయక్‌ను, డాక్టరైన బూర నర్సయ్యగౌడ్‌ను ఎంపీలుగా గెలిపించుకున్నామని తెలిపారు. ఉస్మానియా విద్యార్థులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టికెట్ల ధర్నా చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచి తీరుతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat