ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి సి.రాంచంద్రయ్య వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 13 న విజయనగరం జిల్లాలో జరుగుతన్న పాదయాత్రలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా స్వాగతించనున్నట్లు సమచారం. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. రామచంద్రయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ పొత్తును నిరసిస్తూ మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా శుక్రవారం కాంగ్రెస్‌కు బై చెప్పారు. మరి కొద్ది రోజుల్లో మరో మాజీ మంత్రి రాజీనామా చేసి వైసీపీలోకి అలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమచారం. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్.
