కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, కొడుకుతో కలసి కలిసి మోటార్ బైకుపై ఇంటికొస్తుండగా దాడి జరిగింది. దుండగులు వారిని వెంటాడి సోమేశ్ కళ్లల్లో కారం చల్లారు. తర్వాత వేట కొడవలితో దారుణంగా చంపారు. సోమేశ్ కొడుకుపైనా దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సోమేశ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సోమేశ్ గౌడ్ కుమారుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.
