ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.
ఈనేపథ్యంలో తనపై జరిగిన కత్తి దాడిపై మూడో పార్టీ ద్వారా విచారణ చేయించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు సేకరించిన హైకోర్టు మీపై దాడి జరిగిన వెంటనే పోలీసులకు వాంగ్మూలనం ఇవ్వకుండా హైదరాబాద్ ఎందుకెళ్ళారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ తరపున లాయర్ తన క్లైయింట్ కు ప్రాణాపాయం ఉండటం వలన అత్యావసరంగా వెళ్ళాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే అప్పట్లో ఉమ్మడి ఏపీలో అలిపిరిలో తనపై నక్సలైట్లు బాంబు దాడి చేసిన సమయంలో కూడా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఆసుపత్రికే వెళ్లారని జగన్ తరపున లాయర్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు..