ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే.నాడు మూడు దశబ్ధాల కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతుండటంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు.
వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు వచ్చి అడిగితే మీరు ఎలా టీడీపీతో కలిసిపోతారు. ఇన్నాళ్ళు ఎవరితో అయితే కొట్లాడామో వాళ్ళతోనే కలిసి నడవమని చెబితే ఎలా .. కార్యకర్తల మనోభిష్టం మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారక లేఖ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి,జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపించారు..
అయితే త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ఆయన అనుచవర్గం ఈ సందర్భంగా ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు అని వార్తలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో
హాల్ చల్ చేస్తున్నాయి ..