Home / 18+ / టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి

రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు.హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్‌ వ్యవహార శైలిపై.. తన బహిష్కరణపై పార్టీ అనుసరించిన నాన్చుడు ధోరణిని ఎండగట్టిన 24 గంటల్లోనే ఆ పార్టీ ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించింది. దీంతో జలగం ప్రసాదరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై శుక్రవారం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఉదయం 10 గంటలకు ప్రసాదరావుపై బహిష్కరణను ఎత్తివేస్తున్నట్లు ప్రసార సాధనాల్లో ప్రచారం కావడం, ఏఐసీసీ నేతలు ఆయనను కలవడానికి వస్తున్నారంటూ మరో ప్రచారం ఊపందుకోవడంతో ప్రసాదరావు మనసు మార్చుకుని కాంగ్రెస్‌ వైపు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే జలగం ప్రసాదరావు మాత్రం తన అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని, మూడు నెలలుగా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ తన అభిమానులు, అనుచరుల్లో గందరగోళం సృష్టించడానికి ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటూ శుక్రవారం తనను కలిసిన అభిమానులు, అనుచరులకు స్పష్టం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం వరకు పార్టీలో చేరడం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తన అనుచరులు, అభిమానులను హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన ప్రసాదరావు సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎంతోపాటు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర పార్టీ నుంచి సదరు నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

సుదీర్ఘకాలంగా నాతో ఉన్న అనుచరులు, అభిమానుల మెజార్టీ అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఈ మేరకు శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ భవన్‌లో అధికారికంగా పార్టీలో చేరుతున్నా. నేను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాక కాంగ్రెస్‌ పార్టీ నాపై ఉన్న బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ విజయానికి కృషి చేస్తాను. కాంగ్రెస్, టీడీపీల పొత్తును జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు, సీనియర్‌ కార్యకర్తలు మథనపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat