ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రజాపోరాటాలతో వైసీపీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అనిపిస్తుంది. ఇందులో బాగాంగానే వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ, టీడీపీ అదినేత చంద్రబాబులు భేటీ అయి కలిసి పనిచేయాలన్న నిర్ణయం ప్రభావం నేతలపై పడుతోంది. దీనిని జీర్ణించుకోలేని నేతలు కొందరు రాజీనామాకు సిద్దం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా పంపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వసంత్ కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాగా వట్టి వసంతకుమార్ వైసీపీ పార్టీలో చేరతారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.అయితే వట్టి దారిలోనే మరికొందరు ఉండవచ్చు అని కూడా సమాచారం..
