Home / ANDHRAPRADESH / నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తి ప‌క్ష‌నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైసీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది.‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రదర్శన మెరుగవుతుందని, ఆ కూటమి వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలిపింది. వరదల్లో మునిగిన కేరళకు తక్కువ సాయం చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అక్కడ ఖాతా తెరవడం కష్టమేనని, పార్లమెంట్‌ రెండు సభల్లో మెజారిటీ సాధించేందుకు వ్యూహాత్మకంగా కీలకమైన యూపీలో బీజేపీకి, అఖిలేశ్, మాయావతిల కూటమితో ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించింది.

సర్వే విశేషాలు..
2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైఎస్‌ జగన్ పార్టీ వైసీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్రమంగా ప్రభ కోల్పోతోంది. ఆ పార్టీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుంది. 2014లో రెండు స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈసారి రిక్తహస్తమే. ఓట్లశాతం పరంగా చూస్తే వైసీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. అంతేకాదు ఏపీలో జ‌రిగే అన్ని ఎన్నిక‌ల‌పై ఎన్నో సంస్థ‌లు స‌ర్వేలు చేసినా వైసీపీ విజ‌యం ఖాయం అని తెలుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat