తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి జలగం ను కలిశారు.ఈ క్రమంలోనే రేపు శనివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అని జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..