ఓవైపు తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీలో మొయిలీ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరని ఆయన వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తమకు ఒక స్థాయి అవగాహన ఉన్నదని మొయిలీ చెప్పుకొచ్చారు.
యూపీఏ కూటమిలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని వీరప్ప మొయిలీ చెప్పారు. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందని ఆయన మీడియాతో వెల్లడించారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడిచేందుకే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నట్టు మొయిలీ వెల్లడించారు. శత్రువుకు శత్రువే మిత్రుడని అన్నారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టత ఇచ్చారు. దీర్ఘకాల ప్రయోజనాలను ద ష్టిలో ఉంచుకొని తాము ముందుకు వెళ్తన్నామని చెప్పారు.
Tags chandhrababu congress lramana tpcc ttdp uttham kumar reddy