వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు. ఎన్నో ఎన్నికలను చూశాను కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వస్తున్న స్పందన గతంలో రాలేదని, కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు దీవిస్తున్నారు.అయితే ఇక్కడ కాంగ్రెస్,బీజీపీ,టీడీపీ తరుపున కూడా గట్టి పోటి ఇచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నపటికీ బీజీపీ,టీడీపీ లను మళ్ళి నమ్మి మోసపోమని అక్కడ ప్రజలు చెప్తున్నారు.
ఇక ఒకేసారి రూ.లక్ష రుణమాఫీపై ఎక్కడెళ్లిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చినా ప్రజలు నమ్మలేదు,కానీ టీఆర్‌ఎస్ పార్టీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అసత్య హామీలను నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశారు.ఆసరా పింఛన్లను రూ.2016లకు, రూ.3016లకు పెంపుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు రూ.3016ల నిరుద్యోగ భృతి, ఒంటరి మహిళలకు రూ.2016ల పింఛన్ పెంచుతామని హామీ, ఇంటింటికి తాగునీరందించే మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారు.