కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ది కెపి వివేకానందతో కలిసి పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రలు, ర్యాలీలు,సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించి అందరి మద్దతును కూడగట్టారు. ఇందులో భాగంగానే ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలులో పెడుతున్నారు. నాలుగున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా ముందుకు సాగుతున్నారు.నాలుగున్నరేండ్లలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను చేపట్టింది. వీటిలో వేలాది మంది ప్రజలు లబ్ధి పొందిన విషయం అందరికి తెలిసిందే.
తాజాగా పార్టీ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టో అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. గ్రేటర్లో ఎన్నడూ లేని అభివృద్ధి, నిరంతర విద్యుత్, సమృద్ధ్దిగా తాగునీరు, సంక్షేమ పథకాలు, అదుపులో శాంతిభద్రతలు వంటి ప్రణాళికలను వివరిస్తున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్ది కెపి వివేకానంద ప్రచారానికి అన్ని వైపుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, 50000పైగా మెజార్టీ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్న పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ నియోజకవర్గానికి సంబంధించి వివేకానందపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..