Home / 18+ / ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….

ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….

ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు.
1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం.
2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. కరెంటు కట్ చేయక పొతే మంటలు వచ్చి చెట్లు, కొన్ని ఇళ్లల్లో మంటలు వచ్చే ప్రమాదం ఉందని ముందే ఆపాలని ఆదేశాలు ఇచ్చారు. కరెంటు పోల్స్ పడిపోవటం కానీ, విరిగి పోవటం కానీ జరిగే అవకాశం ఉందని ఆయా ప్రాంతాలలో కొన్ని పోల్స్ రెడీ చేసి, సిబ్బందిని సిధ్ధాంగా ఉంచారు.

3.మంచి నీటి సరఫరాకు ప్రత్యేక ట్యాంకర్లు ముందుగా ఏర్పాట్లు చేసేరు.
4.ముంపు గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు, వారికీ నివాసం ,ఆహార సదుపాయాలు ముందుగా సిధ్ధాంగా ఉంచారు..
5.కొబ్బరి చెట్లు, మరియు ఇతర తోటలు రంక్షించటానికి పైనున్న కొమ్మలు విడిచి పెట్టి , క్రింద నున్న కొమ్మలు నరికే ఒక టీం ఏర్పాటు చేసి నరికించారు. దీని వలన చాలా చెట్లును రంక్షించారు.
6.మత్స్య కారులకు ప్రత్యేక ఏర్పాట్లు, వారి పడవలను కొంచం దూరంగా పెట్టె ఏర్పాట్లు చేసేరు. వేటకు ఎవ్వరిని వెళ్లకుండా ముందుగా గ్రామాలకు టీమ్స్ వెళ్లి వీక్షించారు.

ఒడిశా CM నబీన్ పట్నాయక్, టీమ్స్ అందరికి అన్ని వేళల అందు బాటులో వుంటూ . రాజధాని నుంచే మానిటర్ చేసేరు. అది అడ్మినిస్ట్రేషన్. అందుకే నబీన్ పట్నాయక్ కు ప్రచారం యావ లేదు. అందుకే నిజాయతి గల నబీన్ పట్నాయక్ కు ఒడియా ప్రజలు ఆదరిస్తున్నారో తెలుస్తుంది.

ఇటువంటి ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటే ఇలాంటి ప్రమాదాన్ని అరికట్టేవాళ్ళుగా..కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నడూ ముందస్తుగా పని చేయరు.ఆంధ్రాలో ముందు చర్యలు తీసుకొన కుండా విపత్తు జరిగిన తరువాత షో చేస్తూ రాజకీయంగా చూస్తున్నారు.

యధా రాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు ఉన్నారు. IAS ఆఫీసర్లు కూడా సెల్ ఫోన్ లో పని చేస్తున్నట్లు,కొవ్వొత్తుల లో పని చేస్తున్నట్లు పబ్లిసిటీ. శ్రీకాకుళం పట్టణం లో ఛార్జింగ్ లైట్లు దొరకటం లేదా? NEDCAP ద్వారా సోలార్ లాంప్స్ తెప్పించు కోవచ్చు కదా? ఈ ఖర్చు చాలా చాలా తక్కువ. ఆ మాత్రం బుర్రలేని IAS ఆఫీసర్లు ఉన్నారా? అధికార నాయకులూ మరియు ఆఫీసర్లు కూడా అదే విధంగా తయారయ్యారా ? ఆఫీసర్లు ఎవ్వరికి వ్యక్తిత్వం లేదా? పోలీసులు అందరు బందోబస్తు లో ఉంటే సహాయక చర్యలు లో ఎలా పాల్గొంటారు?

పత్రికా విలేకర్లు, ప్రతిపక్షం కూడా ఈ ప్రశ్నలు ఎందుకు వెయ్యటం లేదు? ముఖ్యముగా విలేఖర్లు గమనించవలసిన విషయాలు కదా? పబ్లిసిటీ కాదు కావల్సింది – పని జరగాలి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat