గోబెల్స్ ప్రచారానికి సుప్రసిద్ధ చిరునామా,అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు అదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వ్యవహరించే బాబు తీరు.ఆయన అత్యుత్సాహం కారణంగానే నవ్వులపాలు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లతో మారోమారు ఈ చర్చ తెరమీదకు వచ్చింది.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కవాతు విజయవంతం అయిందని,ఈ నేపథ్యంలో పవన్‌తో మంత్రి కేటీఆర్ మాట్లాడి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తమదైన శైలిలో దుష్ప్రచారం చేసేందుకు బాబుకు అస్త్రం దొరికింది.ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ ఇద్దరు నేతలు కలుస్తున్నారని ఆయన సూత్రీకరించారు విమర్శలు చేసేశారు.
అయితే ఇలా విమర్శలు చేస్తున్న చంద్రబాబు తన అంతరాత్మకు ఏం జవాబు ఇచ్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.టీడీపీ ఏర్పడింది ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవచించింది కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతం. అయితే దాన్ని తుంగలో తొక్కిన బాబు కాంగ్రెస్‌తో ఏం చక్కా దోస్తీ చేస్తున్నారు.నాలుగేళ్ల కిందటి వరకు బీజేపీతో నడిచి ఇప్పుడు ఆ పార్టీకి బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ చేయి అందుకుంటున్నారు.ఇలా పూర్తి స్వార్థపూరిత రాజకీయానికి చిరునామా అయిన బాబుకు ఎదుటివారిపై విమర్శలు చేసే హక్కు ఎక్కడిదని పలువురు ప్రశ్నిస్తున్నారు.