ఆయన ఒక సామాన్యుడు..పుట్టిన ఊరుకు.. పెరిగిన గడ్డకు..తనను నమ్మిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నాడు. నాడు సమైక్య పాలనలో చూసిన కష్టాలు.. ఎదుర్కున్న అవమానాలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో పాల్గోని స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించాడు.ఆ తర్వాత తన సొంత గ్రామమైన వరికోల్ గ్రామ గురించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నాడు.
గతంలో జరిగిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పసునూరి దయకర్ ను గెలిపించడం కోసం సొంత ఊరు అయిన వరికోల్ గ్రామానికి చెందిన ప్రజలంతా తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకే అని తీర్మానం చేయించారు. అక్కడ నుండి మొదలైన ఆ గ్రామ ఐక్యమత్యం గ్రామాభివృద్ధిలో అతనికి సహకరించారు ఆ గ్రామ ప్రజలు. ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..న్నఊరుకి..పెరిగిన నేలకు ..నమ్మిన ప్రజలకు మంచి చేయడానికి కావాల్సింది పదవులు..అధికారం కాదు..మంచి చేయాలనే తాపత్రయం..ఆరాటం.
అన్నిటికంటే మించి మంచి మనస్సు..అది ఉంటే చాలు అని నిరూపించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,వరికోల్ శ్రీమంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. గత నాలుగున్నరేళ్ళుగా తమ గ్రామ రూపురేఖలు మార్చిన వరికోల్ శ్రీమంతుడు కోసం గ్రామానికి చెందిన వందలాది యువత కదిలోచ్చారు. ఆయన చేసిన సేవను మెచ్చుకుంటూ తాము ఎల్లప్పుడూ మా శ్రీనన్న వెంటే అంటూ కొన్ని వందల మంది యువత బైకు ర్యాలీ నిర్వహించారు..వరికోల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసినందుకు వరికోల్ గ్రామం నుండి పరకాల దాకా..వెంకటేశ్వర్లపల్లి,నార్లపల్లి,చర్లపల్లి,ములిగిల్ల వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డి.తిరుమలరావు,బి.రాజు,దేవిరెడ్డి పోచంపల్లి,సుధీర్ రెడ్డి పోచంపల్లి మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ళుగా గ్రామానికి వరికోల్ శ్రీమంతుడు చేసిన సేవకు కృతజ్ఞతలు చెబుతూ రానున్న కాలంలో వరికోల్ శ్రీమంతుడుతో పాటుగా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని వారు తెలిపారు.