తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరలేపాడు. డబ్బు సంచులతో తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా చంద్రబాబు తీరు మారలేదు. విజయవాడ కేంద్రంగా తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహానికి కుట్రలు పన్నుతున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు టీడీపీ నేత వల్లభనేని అనిల్ హవాలా మార్గంలో రూ.59 లక్షలు తరలిస్తూ పట్టుబడ్డాడు.
అనిల్‌కు చంద్రబాబు, ఎల్.రమణతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు తరుపున తెలంగాణలో పార్టీ వ్యవహారాలను అనిల్ చక్కబెడుతున్నాడు. కూటమి చర్చలు మొదలైనప్పటినుంచి కాంగ్రెస్ నేతలతోనూ అనిల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. టీడీపీ బడా నేతలతోనూ అనిల్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా అనిల్ ఉన్నాడు. టీడీపీ తరుపున అనేక కార్యక్రమాల్లో అనిల్ పాల్గొన్నాడు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనిల్ ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో ప్రచారం నిర్వహించాడు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. నెమ్మదిగా టీడీపీలో కీలక నేతలకు దగ్గరయ్యాడు. ఆయన స్వస్థలం కూడా నందిగామాయే.
అనిల్ తండ్రి చిన్న రైతు. ఆయనకు ఎకరం పొలం కూడా లేదు. సినిమాల్లో లైట్ బాయ్‌గా ప్రయత్నాలు చేసిన అనిల్… సినీ కార్మికుడిగా తప్పుడు సభ్యత్వం తీసుకొని చిత్రపురి కాలనీలో కార్మికులకు రావాల్సిన ప్లాట్లను కబ్జా చేశాడు.