అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు ఏడు వందల మంది రైల్వే ట్రాక్ పై గుమ్మిగూడారు. ఇంతలో రావణ విగ్రహానికి నిప్పు పెట్టడంతో బాణ సంచా పేలింది. బాణ సంచా శబ్ధాలకు ట్రైన్ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించలేకపోయారు.
వేగంగా ట్రైన్ దూసుకు రావడంతో ప్రజలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
రైలు వేగానికి మృతదేహాలు మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. ట్రైన్ కింద పడిన వారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారిపోయింది. రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. ఎటు చూసినా మాంసపు ముద్దలే దర్శనమిస్తున్నాయి.రావణ దహనం కార్యక్రమం ప్రతీ ఏటా అదే ప్రాంతంలో నిర్వహిస్తారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఇలాంటి ఘోరం జరగలేదని చెప్తున్నారు. రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలివస్తున్నారన్న విషయం తెలసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని అయితే రైలు వస్తుందన్న సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. పోలీసులు కానీ, నిర్వాహకులు కానీ రైల్వే శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రాథమికంగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అనుమతి లేకుండా దసరా వేడుకలు నిర్వహించడం జరిగింది.నవజోత్ సింగ్ సిద్ధూ సతీమని వేడుకలలో ముఖ్య అతిథిగా ఉన్నారు మరియు రైలు ద్వారా ప్రజలు పరుగులు తీసిన ఆమెకు అవేమి కనిపించాలేదనుకుంట తన ప్రసంగం ఆపకుండా కొనసాగించింది.ఇలాంటి పరిస్థిలో ఆమె చూపించిన వైఖరి అందరికి ఆగ్రహం తెప్పించింది.