Home / 18+ / ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!

ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు.. వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి కదలికలను అగుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు! ఇప్పుడు తెలంగాణలో గూఢచారి.. పోలీస్ ఆట నడుస్తున్నది! నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలో అత్యంత రద్దీ ఉండే.. ప్రత్యేకించి పోలీసు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాలు కొలువై ఉన్న లక్డీకాపూల్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్‌లోని రూం నంబర్ 122 కేంద్రంగా ఏపీ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారని తెలుస్తున్నది. పూర్తిస్థాయిలో అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఏపీ అధికారుల కదలికలన్నింటిపైనా గట్టి నిఘా పెట్టారని, వారు ఏ సమయంలో ఎక్కడికి వెళుతున్నది.. ఎవరిని కలుస్తున్నది ఆరా తీస్తున్నారని సమాచారం.

తెలంగాణలో ఏపీ నిఘా వర్గాలు దిగాయని నెల క్రితమే సమాచారం వచ్చింది. తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులేమిటి? టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేమిటి? మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు? అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్ అధికారులతో ఆరాతీసినట్టు బయటికి పొక్కడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఒక రాష్ట్రంలో మరో రాష్ర్టానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు రాజకీయ సమాచారం సేకరించడంపై వివిధ వర్గాలు, పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా బుద్ధిమారని చంద్రబాబు.. తన అధికార యంత్రాంగంతో నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారని, పైగా ఎన్నికల షెడ్యూలు విడులైన నేపథ్యంలో పనిని ముమ్మరంచేశారని అధికారులు చెప్తున్నారు. ఒక అడుగు ముందుకేసి.. ప్రముఖ హోటల్‌లో నక్కి.. తెలంగాణ పోలీసు అధికారులపైనే రెక్కీలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat