టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు.వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని సైకిల్ పార్టీ నేతలు వణికిపోతున్నారు.పార్టీ నాయకులపై దాడులు జరగడంపై చంద్రబాబు బయపడుతున్నారని తెలుస్తుంది….బాబు ఇంతగా బయపపడం పై అనుమానాలు వ్యక్తం అవుతునాయి.