అడుగడుగునా జగన్ కు ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తుంది..ప్రజా సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు.చితికిపోతున్న కుల వృత్తులకు మళ్లీ జీవం పోయడానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ అండగా నిలుస్తానన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పేదలకు కంటకంగా మారిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు సోమవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. గుర్ల మండలం కలువచర్ల నుంచి మొదలైన పాదయాత్ర కోటగండ్రేడు, పాలవలస క్రాస్, అనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకు కొనసాగింది. ఆనందపురం క్రాస్ వద్ద ఆయన యాత్ర 3100 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడ ఒక మొక్కను నాటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జగన్ పాదయాత్ర రోజంతా ప్రజా వెల్లువ మధ్య కొనసాగింది.ప్రజల మనసులో సంబరాలు వెలువెత్తాయి.దారిపొడవున వివిధ వర్గాల ప్రజలు ఆయన్ను కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు. చితికిపోతున్న చేతి వృత్తులను, చంద్రబాబు పాలనలో అధోగతిలో ఉన్న కులవృత్తుల కన్నీటి వెతలను దగ్గర్నుంచి పరిశీలించారు. చేనేతన్న మగ్గం పట్టుకున్నారు. గీతన్న గోడును, మత్స్యకారుల మనోగతాన్ని విన్నారు. సెలూన్ షాపుకెళ్లి అక్కడ కుర్చీలో కూర్చుని నాయీ బ్రాహ్మణుల ఇబ్బందులు అర్థం చేసుకున్నారు. బాధలు చెప్పిన రజకులను ఓదారుస్తూ, వారి చేతిలోని ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేశారు. మామిడి రైతులు, యాదవుల గోడు విని.. నేనున్నానని వెన్ను తట్టారు.ఎక్కడికి వెళ్ళిన కావాలి జగన్-రావాలి జగన్ అంటున్నారు.