తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న చంద్రబాబు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారని తలసాని ప్రశ్నించారు.టీడీపీలో ఫీల్డ్ గ్యాంగ్ లేదని, ప్రెస్ మీట్లలో మాట్లాడే గ్యాంగే ఉందని తలసాని ఎద్దేవా చేశారు. అలాంటి టీడీపీ వారిని చూసి భయపడుతామా అని తలసాని ప్రశ్నించారు.
“పది పన్నెండు సీట్ల కోసం టీడీపీ-కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పక్క రాష్ట్రం తో గెలుక్కుంటోంది. హైదరాబాద్‌లో అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజా క్షేత్రానికి వెళితే అసలు సంగతి తెలుస్తుంది. మహా కూటమి లో పొత్తు ,సీట్లు ఖరారయ్యాక అసలు మజా ఉంటుంది“ అని ఆయన పేర్కొన్నారు.
Post Views: 307